Telugu – Plus100years https://www.plus100years.com Helpful tips for happy life Mon, 23 Jun 2025 07:06:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://www.plus100years.com/wp-content/uploads/2025/01/cropped-logo-32x32.webp Telugu – Plus100years https://www.plus100years.com 32 32 రాణి అహల్యాబాయి హోల్కర్: దైవత్వం ఉట్టిపడే ధర్మ పరిపాలకురాలు (Rani ahilyabai holkar history in telugu) https://www.plus100years.com/rani-ahilyabai-holkar-history-in-telugu/ https://www.plus100years.com/rani-ahilyabai-holkar-history-in-telugu/#respond Sun, 22 Jun 2025 13:51:27 +0000 https://www.plus100years.com/?p=7578 రచయిత : ఇ.పవన్ కుమార్

 

రాణి అహల్యాబాయి హోల్కర్: దైవత్వం ఉట్టిపడే ధర్మ పరిపాలకురాలు, ఆమె పాలన  లో  ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది , యుద్దాలు , అరాచకాలు , కుతంత్రాలు ప్రబలంగా ఉన్న ఆ రోజులలో రాణి అహల్యాబాయి తన ప్రజలకు శాంతిని మరియు శ్రేయస్సు అందించింది మరియు ఆమె పాలన ఒక స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది.

rani ahilyabai holkar history in telugu

భారత దేశ చరిత్రలో స్త్రీ శక్తికి , ధర్మ పాలనకు ఒక నిలువెత్తు నిదర్శనంగ నిలిచిన మహోన్నత వ్యక్తి రాణి అహిల్యా భాయి హోల్కర్. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నిజమయిన ” రాజమాత “

18 వ శతాబ్దం లో మరాఠా సామ్రాజ్యం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న వేళ , మధ్య భారతదేశం లోని మాల్వా ప్రాంతాన్ని దాదాపు 28 సంవత్సరాలు పరిపాలించిన మహారాణి అహిల్యా భాయి హోల్కర్.

 

ఆమె గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ..

జననం : అహల్య భాయి మే 31 , 1725  సం. చౌన్ది , అహ్మద్నగర్ , మహారాష్ట్ర లో జన్మించింది.

తల్లి తండ్రులు : మంకోజి రావు షిండే మరియు షశీల షిండే .

తండ్రి మంకోజి రావు షిండే గ్రామానికి పాటిల్ గా వ్యవహరించే వారు .

చిన్నతనం లో నే  అహల్య భాయి ని కండేరావు హోల్కర్ కి ఇచ్చి వివాహం జరిపించారు , ఈయన మల్హర్ రావు హోల్కర్ యొక్క కుమారుడు మరియు హోల్కర్ సామ్రాజ్యాన్ని ఇండోర్ లో స్థాపించాడు.

పిల్లలు : 1754  లో వీరికి మాలెరావు అనే కుమారుడు జన్మించాడు మరియు 1758 లో ముక్త బాయి అనే కుమార్తె జన్మించింది .

భర్త మరణం : 1754 లో జరిగిన కుంభార్ యుద్ధం లో భర్త (కండె రావు) హోల్కర్ ఫిరంగి గుళ్లకు బలిఅయ్యాడు .

భర్త తో పాటు సతి సహగమనం చేసుకుందామని ప్రయతించింది కానీ మల్హర్ రావు వారించాడు , నీ అవసరం ఈ రాజ్యానికి మరియు దేశానికి ఉంది అని ఆమెను ముందుకు నడిపాడు .

అహల్య భాయి రాజ్య తంత్రము , రాజ్య పాలన , యుద్ధ విద్యలు నేర్చుకున్నది , మామ గారు మల్హర్ రావు రాజ్య పాలన కోసం వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ,ఈమెనే రాజ్య పాలన చూసుకునేది .

అహల్య భాయి  హోల్కర్ , గొప్ప ధార్మికురాలు , శివ భక్తురాలు , గొప్ప దార్శనికత కలిగిన పాలకురాలు .

ఈమె యొక్క సామర్త్యాల గురించి ఈమెకు సంబందించిన లేఖ సంభాషణ లలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మామ మరణం : భర్త యొక్క తండ్రి గారయిన మల్హర్ రావు 1766 లో మరణించారు .తదనంతరం కొడుకు మాలె రావు మాల్వా సింహాసనాన్ని  అధిష్టించాడు కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొడుకు మాలె రావు మరణించాడు .

1767 లో అహిల్యాబాయి మాల్వా ని పరిపాలించడం ప్రారంభించారు.

తదనంతరం అహల్యభాయి తన రాజధానిని ఇండోర్ నుండి మహేశ్వర్ కు మార్చింది.మహేశ్వర్ యొక్క ప్రాచీన పేరు మాహిష్మతి దీన్ని కార్త్యవీర్యార్జునుడు తన రాజధాని గా చేసుకుని పాలన సాగించాడు . 

న్యాయమైన మరియు దయగల పాలన: అహల్యాబాయి తన ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి, న్యాయమైన మరియు దయగల పాలనకు ప్రసిద్ధి చెందింది.

పరిపాలనా పరాక్రమం: ఆమె ఒక చతురతగల నిర్వాహకురాలు, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను స్థాపించి, శాంతిభద్రతలను కాపాడింది.

rani ahilyabai holkar history in telugu

న్యాయ సంస్కరణలు: ఆమె న్యాయం పట్ల చాలా శ్రద్ధ వహించింది, ఫిర్యాదులను విని న్యాయంగా పరిష్కరించేలా చూసుకుంది.

సైనిక చతురత: పురుషాధిక్య యుగంలో స్త్రీ అయినప్పటికీ, ఆమె గణనీయమైన సైనిక చతురతను ప్రదర్శించింది, అవసరమైనప్పుడు వ్యక్తిగతంగా సైన్యాలను యుద్ధంలోకి నడిపించింది.

కళలు మరియు సంస్కృతి పోషకురాలు: అహల్యాబాయి కళ, సంస్కృతి మరియు విద్యకు గొప్ప పోషకురాలు. ఆమె నేయడాన్ని, ముఖ్యంగా ప్రసిద్ధ మహేశ్వరి చీరలను ప్రోత్సహించింది.

నేను 2023 లో మహేశ్వర్ ను సందర్శించినప్పుడు అక్కడ గైడ్ చెప్పినదాని ప్రకారం అక్కడ చీరలు చాల ప్రసిద్ధి మరియు సినిమా తారలు కూడా అక్కడికి వచ్చి కొంటారని చెప్పాడు.

అంటే అహల్యాబాయి యొక్క ముందు చూపు ఇప్పుడు అక్కడి వారికి జీవనోపాధిని చూపిస్తోంది .

మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేసారు , ఎన్నో విద్యాలయాలను స్థాపించారు ..

దేవాలయాలు మరియు ఘాట్ల నిర్మాణం: భారతదేశం అంతటా అనేక దేవాలయాలు, ఘాట్లు (స్నానపు మెట్లు), బావులు మరియు (ధర్మశాలలు – విశ్రాంతి గృహాలు) నిర్మాణం మరియు పునరుద్ధరణకు  ఆమె అత్యంత ముఖ్యమైన సహకారాన్ని అందించింది .

ఆమె తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని దానాల కోసం ఖర్చు చేసింది.

ముఖ్యమైన పునరుద్ధరణలు: ఆమె కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, గయ, ద్వారక మరియు అనేక ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విస్తృతమైన పునరుద్ధరణ పనులను చేపట్టింది.

1780  లో కాశీవిశ్వనాథ ఇపుడున్న ఆలయాన్ని నిర్మించింది

ఇప్పుడు ఉన్న విష్ణుపాద దేవాలయాన్ని గయ లో 1787  లో పునర్నిర్మించింది.

1789 లో మహారాష్ట్ర లో ని త్రైయంబకేశ్వర్ జ్యోతిర్ లింగాన్ని పునర్నిర్మించింది.

మహారాష్ట్ర లో ని ఎల్లోర గుహల వద్ద ఉన్న గ్రిశ్నేశ్వర్ మందిరాన్ని పునర్నిర్మించారు

telugu bhakthi

ఆర్థిక శ్రేయస్సు: ఆమె పాలనలో, స్థిరమైన పరిపాలన మరియు వాణిజ్య ప్రోత్సాహం కారణంగా మాల్వా రాజ్యం   ఆర్థికంగా అభివృద్ధి చెందింది.

ఇతర పాలకుల నుండి గౌరవం: ఆమె జ్ఞానం మరియు సమగ్రత ఆమెకు ఇతర పాలకుల నుండి మరియు బ్రిటిష్ వారి నుండి కూడా గౌరవాన్ని సంపాదించిపెట్టింది.

సరళమైన జీవనశైలి: ఆమె రాజ హోదా ఉన్నప్పటికీ, ఆమె సరళమైన మరియు కఠినమైన జీవితాన్ని గడిపింది, ఎల్లప్పుడూ తన ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చింది.

వారసత్వం: అహల్యాబాయి హోల్కర్ ఒక సాధువు రాణి (రాజమాత)గా గౌరవించబడుతోంది మరియు ఆమె భక్తి, జ్ఞానం, ధైర్యం మరియు అసాధారణమైన పాలనకు గుర్తుండిపోతుంది, శాంతి మరియు శ్రేయస్సు యొక్క వారసత్వాన్ని వదిలివేస్తుంది.

ఆమె పాలనను మాల్వా చరిత్రలో తరచుగా “స్వర్ణయుగం”గా పిలుస్తారు.

ఈమె గౌరవార్థం అహ్మద్నగర్ ను అహల్య నగర్ గా పేరు మార్చారు

మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేసారు , ఎన్నో విద్యాలయాలను స్థాపించారు ..

రాణి అహల్యాబాయి మహేశ్వర్ లో కోటను నిర్మించారు ,ఆ కోటను అహల్య కోట అనిపిలుస్తారు. ఇది పవిత్రమయిన నర్మదా నది ఒడ్డున ఉంటుంది ..ఈ కోటాలో ఎన్నో అద్భుత మయిన దేవాలయాలను నిర్మించారు.

ఈమె గౌరవార్థం అహ్మద్నగర్ ను అహల్య నగర్ గా పేరు మార్చారు.

1791 లో అహల్య భాయి కూతురు భర్త యశ్వంత్ రావు మరణించగా సతి సహగమనం చేసుకుంది .

రాణి అహల్య భాయి హోల్కర్ 17 ఆగష్టు 1795  లో స్వర్గస్తురాలయింది.

తుకోజి రావు హోల్కర్  : అహల్యభాయి మరణం తరువాత తుకోజి రావు హోల్కర్ సింహాసన్నాని అధిష్టించాడు , ఈయన అహల్య భాయి దగ్గర కమాండర్ గా పనిచేసాడు .

తుకోజి రావు హోల్కర్ మల్హర్ రావు హోల్కర్ యొక్క దత్తపుత్రుడు మరియు ఆయన మల్హర్ రావు హోల్కర్ మేనల్లుడు శ్రీమంత్ తనుజీ హోల్కర్ రెండవ కుమారుడు.

రాణి అహల్యభాయి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇలాంటి వీర వనితలు మన దేశం లో ఉండి మన దేశ శ్రేయస్సు కోసం పాటుపడినందుకు మన మందరం వారిని మన మనస్సులో పదిలంగా దాచుకుని మనం కూడా దేశ శ్రేయస్సు కోసం కొంతయినా పాటుపడుదాం .

 

మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి WhatsApp : 9398601060

Related Posts

]]>
https://www.plus100years.com/rani-ahilyabai-holkar-history-in-telugu/feed/ 0
కేరళ లో ఉన్న ఈ ఆలయాలను తప్పక దర్శించుకోండి https://www.plus100years.com/kerala-temples-telugu/ https://www.plus100years.com/kerala-temples-telugu/#respond Fri, 06 Jun 2025 10:21:45 +0000 https://www.plus100years.com/?p=7328 ప్రచురణ తేదీ: 06-06-2025

రచయిత: E.Pavan Kumar Sharma

 

దేవుని స్వంత దేశం ” మరియు ” సుగంధ ద్రవ్యాల తోట ”  అని తరచుగా పిలువబడే కేరళ రాష్ట్రం ఎన్నో ఆధ్యాత్మికమయిన విభిన్న మత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే దేవాలయాల తో అలరారుతుంది.

కేరళ ల లో ప్రకృతి తో పాటు ఈ దేవాలయాలను కూడా చూడటానికి మీ ప్రయాణాన్ని ఏర్పాటుచేసుకోండి .

ఈ ఆధ్యాత్మిక వ్యాసం భారతీయ ప్రయాణికులకు మరియు విదేశీ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.


కేరళ లో 15 తప్పక సందర్శించవలసిన దేవాలయాలు


1. అంబలపుజ శ్రీ కృష్ణ ఆలయం, అంబలపుజ

అంబలపుజ లో ఉన్న ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది, దీనిలో అతని పిల్ల తనం లో ఉండే రూపంలో ఉన్న విగ్రహం ఉంటుంది .

అంబలపుజ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించడానికి అనువైన సమయం జూలై లో జరిగే వార్షిక పండుగ, దీనిని అంబలపుజ ఆలయ ఉత్సవం అని పిలుస్తారు మరియు మార్చి నుండి ఏప్రిల్ మధ్య జరిగే ఆరాట్టు పండుగ సమయంలోచాలామంది దర్శిస్తారు.

రైల్వే స్టేషన్ (అంబలపుజ): ఆలయం నుండి స్టేషన్ వరకు 14 కి.మీ (సుమారుగా)


2. అనంతపుర సరస్సు ఆలయం, కాసరగోడ్

9వ శతాబ్దానికి చెందిన ఈ పవిత్ర స్థలం పద్మనాభ స్వామి యొక్క అసలు స్థానంగా నమ్ముతారు.

దశావతారాల గురించి స్పష్టమైన దృశ్యాలను వివరిస్తూ అద్భుతంగా చెక్కబడిన చెక్క పైకప్పులు ఈ ఆలయం యొక్క విశేషమైన లక్షణం.

బాబియా అనే మొసలి ఉండటం ఆలయ మర్మానికి మరింత ఆకర్షణీయంగా ఉంది, ఇది ఒకప్పుడు సరస్సు యొక్క దైవిక సంరక్షకురాలిగా నమ్మబడింది మరియు భక్తులు హానిచేయని మరియు శాఖాహారిగా భావిస్తారు. ఈ మొసలి ఇప్పుడు చనిపోయింది.

🚂 రైల్వే స్టేషన్ (కాసరగోడ్): ఆలయం నుండి స్టేషన్ వరకు 13.5 కి.మీ (సుమారుగా)


3. అట్టుకల్ భగవతి ఆలయం, తిరువనంతపురం

పద్మనాభస్వామి ఆలయం సమీపంలో, అట్టుకల్ భగవతి ఆలయం పార్వతి దేవికి అంకితం చేయబడిన మరొక ప్రార్థనా స్థలం.

✅ ఈమెని కణ్ణగి అని కూడా పిలుస్తారు.
✅ దీని యొక్క చరిత్ర ” శిలప్ప దిగారం “ అనే తమిళ ఇతిహాసం తో ముడిపడి ఉంది

ఇది మతపరమైన కార్యకలాపాల కోసం గరిష్టంగా మహిళా భక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఈ ఆలయాన్ని మహిళల శబరిమల అని కూడా పిలుస్తారు
ఇది ఇప్పుడు ఒక గొప్ప తీర్థ యాత్ర కేంద్రంగా ఉంది

🚂 రైల్వే స్టేషన్ (తిరువనంతపురం): ఆలయం నుండి స్టేషన్ వరకు 3.4 కి.మీ (సుమారుగా)


4. చొట్టనిక్కర దేవి ఆలయం, ఎర్నాకుళం

చొట్టనిక్కర దేవి ఆలయం ఎర్నాకుళంలో ఉంది. ఇది భగవతి దేవికి అంకితం చేయబడిన శక్తివంతమైన ఆలయంగా పరిగణించబడుతుంది,
✅ ఇది ముఖ్యంగా భూత వైద్యానికి మరియు మానసిక వ్యాధుల నివారణకు ప్రసిద్ధి .
✅ ఈ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 10 శతాబ్దం లో నిర్మింపబడినదిగా విశ్వసిస్తారు.
✅ పురాణాల ప్రకారం భోగాచార్య అనే మహర్షిచే నిర్మింపబడినదిగా చెప్తారు

భగవతి దేవి ని ఉదయం సరస్వతిగా, మధ్యాహ్నం లక్ష్మిగా మరియు సాయంత్రం దుర్గ గా పూజిస్తారు.

✅ మరియు మహా విష్ణువు యొక్క విగ్రహం అదే పీఠం మీద ఉండటం వల్ల , అమ్మ నారాయణి అని , భద్రే నారాయణి అని పిలుస్తారు .

✅ కేజక్కవు దేవత ఈ ఆలయ ప్రాంగణం లో ఉపదేవతగా కొలువై ఉంది , ఈ దేవతను అమ్మవారి ఉగ్రరూపంగా భావిస్తారు .

✅ ఇక్కడ సాయంత్రం జరిగే ” వళియ గురుతి ” పూజ చాల ప్రసిద్ధి

✅ ఇది మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక బాధలను నయం చేయడానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది.

🚂 రైల్వే స్టేషన్ (త్రిపునిత్తుర): ఆలయం నుండి స్టేషన్ వరకు 4 కి.మీ (సుమారుగా)

chota nikkar temple
చోట నిక్కర్ భగవతి అమ్మవారు


5. ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం, కొట్టాయం

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం రాష్ట్రంలోని 108 పవిత్రమైన శివాలయాలలో ఒకటి.

మహాదేవునితో పాటు , అయ్యప్ప , భగవతి , దక్షిణామూర్తి మరియు శ్రీ కృష్ణు డి యొక్క ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంగణం లో.

ఈ ఆలయం అద్భుతమైన కుడ్యచిత్ర కళాకృతులకు ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా గోపురం (ఆలయ గోపురం) పై నటరాజ (విశ్వ నర్తకి) యొక్క ఐకానిక్ చిత్రణ భక్తులు మరియు కళా ప్రియులకు ప్రధాన ఆకర్షణ.
ప్రస్తుత ఆలయ భవనం మరియు గోపురం క్రీస్తు శకం : 1542 లో పునర్నిర్మించబడ్డాయి .

ఆదిశంకరాచార్యులు ఈ ఆలయం లో బస చేసినప్పుడే అమ్మ వారి యొక్క అద్భుత రచన అయిన ” సౌందర్య లహరిని ” రచించారు

🚂 రైల్వే స్టేషన్ (ఎట్టుమనూర్): ఆలయం నుండి స్టేషన్ 2 కి.మీ (సుమారుగా)


6. మన్నారసాల శ్రీ నాగరాజ ఆలయం

సర్ప దేవతలకు అంకితం చేయబడిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తీర్థయాత్ర కేంద్రం. హరిపాడులో ఉన్న ఇది, ఇతర శంకర దేవాలయాల మాదిరిగానే మొత్తం ప్రాంతం చుట్టూ పచ్చని అడవులను కలిగి ఉంది. భక్తుల నుండి నైవేద్యంగా పాముల చిత్రాలను కలిగి ఉంది.
పురాణాల ప్రకారం మందరసాల నుండి మన్నరసాల గా మారింది , మందార చెట్లతో నిర్మించబడిన ప్రదేశం అని అర్థం.

ఇక్కడ ఉన్న నాగరాజు దేవత , బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుని యొక్క ప్రతిరూపం
ఈ క్షేత్రానికి అనంతుడు (విష్ణు) మరియు వాసుకి (శివ )ఇద్దరి ప్రాధాన్యం వహిస్తారు .
ఈ ఆలయం ప్రపంచం లో నే విశిష్టమయిన సర్ప ఆలయం గా ప్రసిద్ధి చెందింది , ఇక్క 1,00,000 విగ్రహాలు ఉన్నాయి

🚂 రైల్వే స్టేషన్ (హరిపాడు రైల్వే స్టేషన్): ఆలయం నుండి స్టేషన్ 3 కి.మీ (సుమారుగా)


7. పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం

పద్మనాభస్వామి కేరళలో అత్యంత ప్రసిద్ధ ఆలయం, విష్ణువుకు అంకితం చేయబడింది. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఇది దాని వైభవం, రహస్యం మరియు నిధితో నిండిన భూగర్భ ఖజానాలకు ప్రసిద్ధి చెందింది.

✅ ఈ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురం లో ఉంది.
✅ ఇది ప్రపంచం లో అత్యంత ధనిక దేవాలయాల లో ఒకటి
✅ ఈ ఆలయానికి 1000 ఏళ్ళ చరిత్ర ఉంది .
✅ శ్రీ మహా విష్ణువు యొక్క 108 దివ్య ఆలయాలలో ఇది ఒకటి.

ట్రావెన్కోర్ రాజ కుంటుంబానికి చెందిన రాజా మార్తాండ వర్మ గొప్ప విష్ణు భక్తుడు , ఆయన తన కలం లో ఎన్నోవిలువయిన సంపదలు ఈ ఆలయానికి బహూకరించాడు.
ఈ ఆలయం లోని ఎన్నో నేలమాళిగలలో విలువయిన సంపద ఉందని నమ్మకం , వీటిని నాగబంధంవేసి మూసి వేశారు..వీటిని తెరవడం భక్తుల నమ్మకానికి సంబందించినది అందుకే కొన్ని తెరవడం లేదు.

100 అడుగుల ఆలయ గోపురం మరియు ప్రధాన దేవత 18 అడుగుల ఆది శేషువుని మీద అనంతశయన భంగిమలో ఉంటుంది.

✅ ఈ ఆలయం ఏటా 2 పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. అల్పశి పండుగ అక్టోబర్/నవంబర్ నెలల్లో, పంగుని పండుగ మార్చి/ఏప్రిల్ నెలల్లో జరుగుతుంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయం, కేరళ

🚂 రైల్వే స్టేషన్ (తిరువనంతపురం): ఆలయం నుండి స్టేషన్ వరకు 1 కి.మీ (సుమారుగా)

anantha padmanabha swamy temple


8. శబరిమల ఆలయం, పతనంతిట్ట

దక్షిణ భారతదేశం లో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం పశ్చిమ కనుమల దట్టమైన అడవితో చుట్టుముట్టబడి, పెరియార్ టైగర్ రిజర్వ్ సమీపంలోని పతనంతిట్ట జిల్లాలో ఉంది.

ఈ ఆలయం 800 సంవత్సరాల పురాతనమయినది గా చెపుతారు , రామాయణ కాలం లో శబరీ అనే రామ భక్తురాలు శ్రీ రాముడికి ఎంగిలి పండ్లను సమర్పించిన ప్రదేశం ఇదేనని చెపుతారు .
ఆమె పేరు మీద ఈ ప్రాంతానికి ” శబరిమల “ అనే పేరు వచ్చింది .

శబరిమల ఆలయం పూజనీయమైన అయ్యప్ప స్వామికి అంకితం చేయబడిన, ప్రతి సంవత్సరం, లక్షలాది మంది సందర్శకులు శబరిమల ఆలయానికి ఆశీర్వాదం కోసం వస్తారు. అంతేకాకుండా, ఈ తీర్థయాత్రను ప్రధానంగా పురుష భక్తులు చేపడతారు.

✅ 40 రోజుల కఠినమయిన దీక్ష అనంతరం అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు .

✅ ఈ ఆలయం లో పంచలోహాలతో ఉన్న అయ్యప్ప విగ్రహం ఉంటుంది
మండల పూజ మరియు మకర విళక్కు చాల ప్రసిద్దమయిన ఉత్సవాలు .

🚂 రైల్వే స్టేషన్ (చెంగన్నూర్): ఆలయం నుండి స్టేషన్ వరకు 90 కి.మీ (సుమారుగా)


9. శివగిరి ఆలయం, వర్కల

శివగిరి ఆలయం ప్రముఖ సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు సమాధి స్థలం (1856 – 1928 ).

ఈ యాత్రా స్థలం ఒక ప్రసిద్ధ గమ్యస్థానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ఆరాధన మరియు ధ్యానం కోసం అవకాశాలను అందిస్తుంది.
✅ శ్రీ నారాయణ గురు చే స్థాపించబడిన ఆశ్రమం.
✅ ఇక్కడ శారదా మాత (సరస్వతి) ఆలయం ఉంది.

🚂 రైల్వే స్టేషన్ (వర్కల శివగిరి): ఆలయం నుండి స్టేషన్ వరకు 2 కి.మీ (సుమారుగా)


10. తాలి ఆలయం, కోజికోడ్

కోజికోడ్‌లోని తాలి ఆలయం శివుడికి అంకితం చేయబడింది.
✅ ఈ ఆలయం కేరళ లో ఉన్న ప్రసిద్ధ శివ ఆలయాలలో ఒకటి

✅ ఈ ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం 14 వ శతాబ్దం లేదా అంతకు పూర్వం ది అని చరిత్రకారులు భావిస్తున్నారు .

ప్రతి సంవత్సరం ఇక్కడ ” రేవతి పట్టతానం “ అనే సాంసృతిక పండిత సభ నిర్వహించబడుతుంది .
18 వ శతాబ్దం లో టిప్పు సుల్తాన్ దండయాత్ర లలో ఈ ఆలయం ధ్వంసం కాబడ్డది .తిరిగి జ్యూమెరియన్ రాజులు పునర్నిర్మించారు .


11. తిరునెల్లి ఆలయం, వయనాడ్

బ్రహ్మగిరి కొండలలో ఉన్న ఈ పురాతన విష్ణువు ఆలయాన్ని తరచుగా “దక్షిణ కాశీ” అని పిలుస్తారు. ఎందుకంటె ఇక్కడ చేసే పితృతర్పణ క్రియలకు కాశి లో చేసిన ఫలితం లభిస్తుంది .
తిరునెల్లి అంటే ఉసిరి చెట్టు , స్వయంగా బ్రహ్మదేవుడు ఇక్కడ శ్రీ మహా విష్ణువును ప్రతిష్టించాడని చెపుతారు .

✅ ఆలయ సమీపం లో పాపనాశిని నది ప్రవహిస్తుంది ..ఇక్కడ పితృ కర్మలు చేస్తే పితృదేవతలు తరిస్తారని ప్రతీతి.

ఈ ఆలయాన్ని చేర రాజు కులశేఖరన్ స్థాపించాడని నమ్ముతారు. తిరునెల్లి ముఖ్యంగా పూర్వీకుల ఆచారాలను నిర్వహించడానికి పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది.

For Your Feedback WhatsApp: +91 9398601060

————————————————————————————————————————————————

Related Posts

]]>
https://www.plus100years.com/kerala-temples-telugu/feed/ 0
దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ? ( Dattatreya Charitra In Telugu ) https://www.plus100years.com/datta-charitra-telugu/ https://www.plus100years.com/datta-charitra-telugu/#respond Sat, 26 Apr 2025 11:06:27 +0000 https://www.plus100years.com/?p=6124 Updated : 27-04-2025

రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ

 

” నాన్యా స్త్రాతా నాపి దాత న భర్తా | తత్వో దేవత్వం శరన్యో శోక హర్తా |
కుర్వాత్రేయ అనుగ్రహం పూర్ణ రాతే | గోరత్కష్టదుద్దరాస్మాన్ నమస్తే |  “

హే శరణాగత వత్సల ! నువ్వు తప్ప పోషకుడు , యజమాని , రక్షించువారు , కృపాకరుడు ఎవరు లేరు . ఎవరు నిన్ను సంపూర్ణంగ శరణు వేడుకొంటారో అటువంటి వారిని దయతో అనుగ్రహిస్తావు . ఓ దత్త ప్రభో ! నన్ను ఇహపర కష్టముల నుంచి ఉద్ధరించే శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం .


దత్తాత్రేయుడు ఎవరు ?

దత్తాత్రేయుడు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క సమ్మిళిత రూపం.

దత్తాత్రేయుడిని ఏమని పిలుస్తారు ?

” త్రిమూర్తి స్వరూపుడు ”  ” ఆది గురువు ” అని పిలుస్తారు.

dattatreya swami charitra telugu


దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ?

మార్కండేయ పురాణం ప్రకారం అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూయ దేవి చాల తపోనిష్ఠ కలవారు,

నారద మహర్షి వీరి తపో నిష్ఠను మరియు పాతివ్రత్యం  గురించి బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క భార్యలకు వివరించాడు. వారు వీరిని పరీక్షిద్దాం అని అనుకుని ..ఈ ముగ్గురిని వారి వద్దకు పంపించారు ..

ఒక దినాన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు అనసూయ దేవి ఇంటికి వచ్చి బిక్ష పెట్టమని అడిగారు , అందులో ఒక షరతు పెట్టారు  ఆ షరతు ఏమిటంటే మీరు మాకు బిక్ష పెట్టాలంటే మీరు నగ్నముగా ఉండి వడ్డించాలి అని అడిగారు ..

అందులకు ఆమె వారికి బిక్ష పెట్టకుండా పంపితే వాళ్ళు ఆకలితో బాధపడతారు పెట్టకుండా పంపడం మహా పాపం అని అనుకుని , వారి షరతుకు అంగీకరించింది .

అప్పుడు అనసూయ దేవి తన మనస్సులో భర్తను తలుచుకుని వారి తపో శక్తి తో ఆ ముగ్గురిని చిన్న పిల్ల ల లాగ మార్చివేసింది.

అప్పుడు ఆ ముగ్గురు చిన్న పిల్ల వాళ్ల లా మారిపోయారు ,అలా ఆమె వారికి బిక్ష పెట్టి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది .

తన భర్త ఇంటికి వచ్చే సరికి ఈ ముగ్గురు పిల్లలను చూసి వారు భగవత్ స్వరూపులని తెలుసుకుని వారిని స్తుతించే సరికి వారు వారి నిజమయిన రూపాన్ని ఆ దంపతులకు చూపించారు .

ఆ ముగ్గురు ఈమె త్యాగాన్ని చూసి మేము ముగ్గురం కలిసి మీ గర్భం లో ఒకే కుమారుని లాగా జన్మిస్తాం అని వరమిచ్చారు ..
అలా అనసూయమాత మరియు అత్రి దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు

” దత్త “ అనగా సమర్పించుకున్న అని అర్థం , దీన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి త్రిమూర్తులు తమ యొక్క మూడు శరీరాలను ఈ పుణ్య దంపతులకు సమర్పించుకున్నారు దత్తాత్రేయుని రూపం లో .

రెండవది : మనం మనుషులం మన కున్న అడ్డుగోడలు (కోపం , ఆక్రోశం , గర్వము ) వీటిని ఆ భగవన్తంతుడికి సమర్పించుకోవాలి ..ఇలా జరిగినప్పుడు ఆ దత్తాత్రేయుని కృప మన మీద కలిగి కలియుగ బాధలనుండి విముక్తి కలుగుతుంది.

దత్తాత్రేయుని అంశ జ్ఞానానికి ప్రతీక , దత్తాత్రేయుడు ఆది గురువు.

ఎప్పటివరకు ఈ ప్రపంచం మీద అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు గురువు యొక్క అవతారం కొనసాగుతూ ఉంటుంది .

విష్ణువు యొక్క అవతారాలలో దత్తాత్రేయులు 8 వ అవతారంగా చెపుతారు .

దత్తాత్రేయుని రూపం మూడు ముఖాలు (బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క ప్రతీక ) , ఆరు చేతులు (శక్తి కి సంకేతం ) , 4 శునకాలు (4 వేదాలకు ప్రతీక )


కలియుగం లో దత్తాత్రేయుని యొక్క ముఖ్య అవతారాలు :

శ్రీపాద శ్రీవల్లభులు , నృసింహ సరస్వతి స్వామి , అక్కల్ కోట్ స్వామి సమర్థ ,గంగాధర సరస్వతి స్వామి (గురు చరిత్రను లిఖించిన మహాత్ములు), వాసుదేవానంద సరస్వతి స్వామి (టెంబే స్వామి) , సాయి బాబా , మొగిళిచర్ల అవధూత స్వామి , గణపతి సచ్చిదానంద స్వామి , నానా మహారాజ్ తారనేకర్ , మాణిక్ ప్రభు మహారాజ్ , సంత్ గజానన్ మహారాజ్ , స్వామి గంగ గిరి మహారాజ్ , తాజుద్దీన్ బాబా , గులవని మహారాజ్ , మాణిక్ ప్రభు మహారాజ్  — ఇంకా ఎందరో దత్త గురువులు మన పుణ్యభూమి లో కొలువై ఉన్నారు.

dattatreya swami swami samartha

తప్పకుండ చూడవలసిన దత్త క్షేత్రాలు :

🕉 గానగపూర్ దత్త క్షేత్రం — కర్ణాటక

🕉 మాణిక్ ప్రభు సంస్థాన్ – మాణిక్ నగర్ – కర్ణాటక
🕉 అవధూత దత్తపీఠం మైసూర్ – కర్ణాటక
🕉 కారంజ — మహారాష్ట్ర
🕉 నర్సోబావాడి — మహారాష్ట్ర
🕉 ఔదుంబర్ — మహారాష్ట్ర
🕉 మహోర్ దత్త క్షేత్రం – మహోర్ – మహారాష్ట్ర
🕉 శ్రీ క్షేత్ర పావని : మహారాష్ట్ర
🕉 షిర్డీ — మహారాష్ట్ర
🕉 షెగావ్ — మహారాష్ట్ర
🕉 మాన్గావ్ — మహారాష్ట్ర
🕉 శ్రీపాద శ్రీవల్లభ దత్త క్షేత్రం – పిఠాపురం – ఆంధ్రప్రదేశ్
🕉 శ్రీశైలం — ఆంధ్రప్రదేశ్ 
🕉 ఎత్తిపోతల — ఆంధ్రప్రదేశ్
🕉 మొగిళిచర్ల — ఆంధ్రప్రదేశ్ 
🕉 దత్త ముక్తి క్షేత్రం – రాజమండ్రి – ఆంధ్రప్రదేశ్ 
🕉 గిరినార్ — గుజరాత్
🕉 కురువపురం దత్త క్షేత్రం — తెలంగాణ
🕉 సంతచారి దత్త మఠము – నిజామాబాద్ – తెలంగాణ
🕉 దత్త క్షేత్రము — మల్లారం – నిజామాబాద్ – తెలంగాణ
🕉 నానా మహారాజ్ తారనేకర్ ఆశ్రమం – ఇండోర్ (మధ్యప్రదేశ్ )
🕉 ఏకముఖ దత్తాత్రేయ మందిర్ – వారణాసి (కాశి) – ఉత్తర్ ప్రదేశ్

ఇవే కాకుండా ఇంకా ఎన్నో దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమయిన క్షేత్రాలు కలవు .

 

దత్త సాంప్రదాయం అంటే ఏమిటి ?

వివిధ పద్దతుల లో దత్తత్రేయుని ఉపాసించడాన్ని దత్త సాంప్రదాయం అంటారు , కొన్ని దత్త సంప్రదాయాలు …

✅ పురాణ సాంప్రదాయం
✅ గురుచరిత్ర సాంప్రదాయం
✅ నిరంజన్ రఘునాథ్ సాంప్రదాయం
✅ అవధూత పంత్ సాంప్రదాయం
✅ శ్రీ కళావతి స్వామి సాంప్రదాయం
✅ వార్కరీ సాంప్రదాయం


దత్త ఉపాసన ఎలా చేయాలి ?

ఏ దేవుడి ఉపాసనకయినా కొంత క్రమశిక్షణ , కొన్ని ఉపాసన పద్ధతులు అవలంభించాలి .దత్త ఉపాసనలో దత్త గురువు నుండి (దత్త ఉపాసకులు ) నుండి దత్తాత్రేయ మంత్రాన్ని స్వీకరచించాలి , దాన్ని గురువు చెప్పినట్టుగా త్రికరణ శుద్ధి గా ఆచరించాలి.

గురుచరిత్ర , వాసుదేవానంద స్వామి చరిత్ర , శ్రీ పాద శ్రీవల్లభుల చరిత్ర లేదంటే మీకు నచ్చిన గురువుల యొక్క చరిత్ర పారాయణం చేయడం అత్యంత శుభప్రదం.

సాత్వికంగా ఉండటం నేర్చుకోవాలి , మనలో ఉండే కొన్ని అవరోధాలను మెల్లిగా తీసివేయాలి .
ప్రతిరోజు కొంత సమయాన్ని ఉపాసనకు కేటాయించాలి.
వీలయితే దత్త క్షేత్రాలను సందర్శించాలి.
దత్తాత్రేయుని అవతారం గా కొలువబడే పరమ పూజ్య వాసుదేవానంద సరస్వతి స్వామి యొక్క స్తోత్రాలను పఠించాలి.

గురువుల తో ,పెద్దల తో గౌరవ పూర్వకంగా ఉండాలి. తల్లి తండ్రులే ఆది గురువులు వారిని దత్త స్వరూపాలుగా చూడాలి .

దత్తాత్రేయ స్వామి జయంతి రోజు వీలయితే అన్నదానం , క్ష్త్రేత సందర్శనమ్ లేదా ఇంట్లో నే దత్తుడికి శక్తి కొలది పూజ చేయడం వల్ల ఆయుర్ ఆరోగ్యాలు ,జ్ఞాన సముపార్జన, శత్రు బాధలు , అకాల బాధలు , ఆటంకాలు తొలిగిపోతాయని నా యొక్క అభిప్రాయం.

 

ధన్యోస్మి

” దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర “

 

మీ యొక్క విలువయిన  అభిప్రాయాలూ , సూచనలు మరియు సలహాల కోసం సంప్రదించండి : WhatsApp : 9398601060

Follow www.plus100years.com for regular updates 

Related Posts

]]>
https://www.plus100years.com/datta-charitra-telugu/feed/ 0
Vishnu Sahasranamam Chanting Benefits In Telugu-విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అద్భుత ప్రయోజనాలు https://www.plus100years.com/vishnu-sahasranamam-chanting-benefits-in-telugu/ https://www.plus100years.com/vishnu-sahasranamam-chanting-benefits-in-telugu/#respond Sat, 29 Mar 2025 15:17:12 +0000 https://www.plus100years.com/?p=5295 రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ

 

శ్రీ  విష్ణు సహస్రనామం లోని 1000 నామాలు చాలా శక్తివంతమైనవి, ముఖ్యంగా ఈ కలియుగంలో, 

మన దైనందిన జీవితంలో వచ్చే ఏవైనా ఇబ్బందులను తట్టుకునే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇస్తాయి.

విష్ణు సహస్రనామం == అనగా భగవాన్ విష్ణువుకి సంబందించిన 1000 నామాలు (పేర్లు).

మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చాలా కలత చెందాడు మరియు అసంతృప్తి చెందాడు.

గొప్ప వాడయిన భీష్మ పితామహుడు తన మరణం కోసం ఎదురు చూస్తున్నాడు, మరియు యుధిష్ఠిరుడు మానసిక ప్రశాంతతను కోరుతూ ఆయన వద్దకు వచ్చాడు… వారి సంభాషణ సమయంలో, భీష్ముడు మానసిక వేదనను అధిగమించడానికి శ్రీ విష్ణు సహస్రనామం జపించమని యుధిష్ఠిరుడిని కోరాడు..

vishnu sahasranamam benefits in telugu


శ్రీ విష్ణువు యొక్క 1000 నామాలను జపించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అందుకే మనం ప్రతిరోజూ శ్రీ విష్ణుసహస్రనామం జపించగలిగితే, అది మన దైనందిన జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

ఈ కలియుగం లో మనకు ఉన్న ఒక అద్భుత దైవారాధనకు సంబందించిన గొప్ప స్తోత్రాలలో
విష్ణు సహస్రనామం ఒకటి .

ఈ నామాలు మన నిత్య జీవితం లో అనునిత్యం భక్తి తో పఠిస్తే అనేకమయిన మానసిక వైకల్యాలలను అధిగమిస్తాము .

 

విష్ణు సహస్రనామం మహాభారతం యొక్క సారాంశం అని చెప్పబడుతుంది.


మూలం :

విష్ణు సహస్రనామం మహాభారతం లోని అనుశాసనిక పర్వం 149 వ అధ్యాయం
లో ఉంది

యుధిష్టరుడు భీష్మ పితామహు న్ని ఇలాంటి ప్రశ్నలు అడిగాడు …

ఒకే ఒక పరమ దేవత ఏమిటి

ఒకే ఒక పరమ ఆశ్రమం ఏమిటి ?
ఎవరిని కీర్తించడం ద్వారా మనిషి శుభాన్ని పొందగలడు
ఎవరిని కీర్తించడం ద్వారా మనిషి శాంతి మరియు శ్రేయస్సును పొందగలడు ?
మీ అభిప్రాయం ప్రకారం గొప్ప ధర్మం ఏమిటి ?
దేని జపం ద్వారా మనిషి సంసార బంధనాలను దాటి వెళ్ళగలరు ?

అప్పుడు భీష్ముడు అది విష్ణు సహస్రనామాన్ని జపించడం ద్వారా సాధ్యపడుతుందని జవాబిచ్చి , విష్ణు సహస్రనామాన్ని యుధిష్ఠరునికి బోధించాడు ..


విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు :

Vishnu Sahasranamam Chanting Benefits In Telugu

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
భక్తి మరియు విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది  మరియు  భగవంతుని మీద అచంచలమయిన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

భక్తి మరియు విశ్వాసం :
ఈ నామాలను క్రమం తప్పకుండ జపించడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ,దైవిక ఉనికి మరియు మార్గదర్శకత్వం పెంపొందుతుంది ..

మనసును శుద్ధి చేస్తుంది:
ఈ పవిత్ర శ్లోకాలు మనస్సును ప్రతికూలత నుండి శుద్ధి చేస్తాయని, ఆధ్యాత్మిక వృద్ధిని మరియు ప్రశాంతతను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు.

మోక్ష ప్రాప్తి (మోక్షం):
భక్తితో, విశ్వాసంతో జపించడం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ప్రతికూలతలను అధిగమించడం:
సహస్రనామం పురోగతికి ఆటంకం కలిగించే అడ్డంకులు, మరియు ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుందని చెప్పబడింది.

పురోగతి కోసం :
శ్రీ మహా విష్ణువు సహస్ర నమాలను చదవడం వల్ల జీవితానికి సంబందించిన అడ్డంకులు మరియు ప్రతికూల శక్తులు తొలగించబడతాయి .

మానసిక స్థైర్యం :
ఈ నామాలు నిత్యం పఠించడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది , ఆత్మ బలం పెంపొందుతుంది . మానసిక పరిపక్వత వస్తుంది .

మోక్షం :
వీటిని జపించడం వల్ల మోక్షానికి మార్గం లభిస్తుంది అంతిమ సత్యాన్ని అర్థం చేసుకుని మోక్షమార్గం లో నడవవచ్చు .

జ్ఞానం :
జ్ఞానం అంటే మంచి చెడు ను తెలుసుకుని జీవితం లో ముందుకు వెళ్లడం , ఈ జ్ఞానం విష్ణు సహస్రనాలను చదవడం వల్ల వస్తుంది .

ప్రశాంతత: 
మానసిక ప్రశాంతత లభిస్తుంది , వీటిని చదివిన తరువాత మనస్సు నిర్మలమవుతుంది.

పెండ్లి కోసం :

విష్ణుసహస్రనామ పారాయణం వల్ల పెండ్లి కాని యువతీ యువకులకు పెండ్లి అవుతుందని నమ్మకం .

ఆర్థిక అభివృద్ధి కోసం :
విష్ణుసహస్ర నామ పారాయణం వల్ల ఆర్థిక సంబంధమయిన అవరోధాలను అధిగమిస్తాము అని విశ్వాసము

దుర్గుణాలను పారదోలుటకు :
మనిషిలో ఉండే అహంకారం , గర్వము మరియు కోపం వంటి గుణాలను ఈ నామాలు జపించడం వల్ల తగ్గించుకోవచ్చు.

జాతక గ్రహ దోషాలు :
జాతక రీత్యా గురు , బుధ , శని , కుజ గ్రహ దోషాల వల్ల కలిగే దుష్ప్రభావాలను అధిగమించడానికి విష్ణు సహస్ర నామ పారాయణం శ్రేయస్కరం

 

పరమాత్ముడు ఎవరు :
వసుర్వవసుమనాసత్య : సమాత్మా సమ్మిత : నమ:
అమోఘ: పుండరీకాక్షో వృషాకర్మా వృషాకృతి:

ప్రశస్తమయిన మనసు కలిగినవాడు , రాగ ద్వేష దోషాలు లేవు కావున అత్యంత శ్రేష్ఠమయిన మనస్సు కలిగినవాడు పరమాత్మ .

ఏ సమయం లో పఠించాలి

1 . ఉదయం ఇంకా వీలయితే  బ్రహ్మ ముహూర్తం సమయం లో
2 . సూర్యాస్తమయం సమయం లో / గోధూళి సమయం లో
3 . రాత్రి సమయం లో పడుకునే ముందు
4 . విష్ణువుకి ఇష్టమయిన ఏకాదశి దినాలలో


విష్ణు సహస్రనామాలు ఎలా జపించాలి ?

మనం ఏదయినా ఇష్టదైవాన్ని నిర్మలమయిన మనస్సుతో ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి …
అలానే విష్ణు సహస్రనామాలను కూడా ప్రతి రోజు ఒక నిర్దిష్టమయిన సమయం లో ప్రశాంత మయిన స్థలం లో కూర్చుని చదవాలి , మొదటి సారి చదవటానికి 60 నిమిషముల కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు …అలవాటు అయినాక ఒక 30 నిమిషాల వరకు నెమ్మదిగా అక్షర దోషం లేకుండా చదవాలి

40 రోజులు దీక్షగా రోజు చదవచ్చు
1 సంవత్సరం అయినా చదవచ్చు
ప్రతిరోజు నిరంతరాయంగా కూడా చదవచ్చు
బుధవారం మరియు ఆదివారం అయినా కూడా చదవచ్చు (ఏవయినా ఒక రెండు లేదా కానీ మూడు రోజులు చదవచ్చు )
నూతన గృహప్రవేశ సమయం లో కూడా చదవచ్చు

 

ధన్యవాదములు

Note : ఈ యొక్క ఆర్టికల్ కు ఆధారం : గ్రంథాలు , సాధకుల అభిప్రాయాలూ , పండితుల యొక్క ఉపన్యాసాలు

 

ఈ వ్యాసం మీద మీ యొక్క సూచనలు , అభిప్రాయాలూ మరియు ఇంకా ఎక్కువ సమాచారం కోసం :9398601060

Related Posts

]]>
https://www.plus100years.com/vishnu-sahasranamam-chanting-benefits-in-telugu/feed/ 0
8 Watermelon Benefits In Telugu https://www.plus100years.com/watermelon-benefits-in-telugu/ https://www.plus100years.com/watermelon-benefits-in-telugu/#respond Fri, 28 Mar 2025 06:28:58 +0000 https://www.plus100years.com/?p=5238 29-03-2025

రచయిత : ఇ.పవన్ కుమార్

వాటర్మిలాన్ ఈ పండుని తెలుగులో పుచ్చకాయ అని పిలుస్తాం కర్బుజా అని కూడా పిలుస్తాం .కర్బుజా అనే పదం ఉర్దూ భాష నుండి వచ్చింది .

వివరంగా Watermelon Benefits In Telugu లో తెలుసుకుందాం 

ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే పండు పుచ్చకాయ ..
రుచికరం గా నే కాకుండా దీని లో అనేక పోషకవిలువలు ఉంటాయి ..
ముఖ్యంగా వేసవి కాలం లో ఈ పండుని తింటాం ..

పుచ్చకాయ శరీరానికి చలువదనాన్ని కలిగిస్తుంది. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు వేసవిలో ఎక్కువగా తినే పండు ఇదే కావొచ్చు ..

 

1 నీటి లభ్యత

దీని లో  90 %  వరకు నీరే ఉంటుంది ,అందుకే వేసవి కాలం లో మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా  ఇది  మనల్ని కాపాడుతుంది .
వేసవి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయం లో దీన్ని తింటే మన శరీరం అలిసిపోదు మరియు వడ దెబ్బ కి గురికాకుండా కాపాడుతుంది.

 

2. పోషక విలువలు మెండు

దీని లో విటమిన్ ఎ , విటమిన్ సి , విటమిన్ బి 6 , పొటాషియం , మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఈ విటమిన్ ల వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది .

 

3. గుండె ఆరోగ్యం కోసం

పుచ్చకాయ లో ఉండే లైకోపీన్ అనే యాంటియోక్సిడెంట్స్ హార్ట్ కు సంబందించిన రుగ్మతల నుండి కాపాడుతుంది .ఇది చెడు క్రొవ్వు (కొలెస్టరాల్ ) మరియు అధిక రక్త పోటును తగ్గిస్తుంది .

 

4. జీర్ణక్రియ

దీనిలో ఉండే పీచు మరియు అధిక నీటి శాతం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది మరియు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది .

 

5. వెయిట్ లాస్

పుచ్చకాయ లో క్యాలోరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ కావడానికి దోహదపడుతుంది

 

6. రోగ నిరోధక శక్తి

విటమిన్ సి ఇందులో ఉండటం వల్ల రోగనిరోధకశక్తి పెరగడానికి దోహదపడుతుంది .ఈ శక్తి వల్ల వ్యాధులు సంక్రమించకుండా ఉపయోగపడుతుంది .

 

7. చర్మం మరియు వెంట్రుకలకు 

విటమిన్ ఎ మరియు విటమిన్ సి కలిగివుండటం వల్ల ఆరోగ్యకరమయిన చర్మానికి మరియు వెంట్రుకలకు ఉపయోగపడుతుంది .


8. ఎముకల ఆరోగ్యం కోసం 

దీని లో ఉండే సిట్రుల్లిం అనే ఎమినో ఆసిడ్ వల్ల ఎముకల లో వచ్చే ఒక రకమయిన అసౌకర్యం,

నొప్పిని ని తగ్గిస్తుంది, అలానే వ్యాయామం చేసిన తరువాత వచ్చే నొప్పి ని తగ్గిస్తుంది.

 

9. మెరుగైన కంటి ఆరోగ్యం కోసం

కంటి చూపు మరియు కంటి ఆరోగ్యం కోసం పుచ్చకాయ ఉపయోగపడుతుంది , దీని లో విటమిన్ ఎ మరియు లైకోపీన్ కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి .అలానే శరీరం లో కలిగే మండే స్వభావాన్ని తగ్గిస్తుంది .

 

100 గ్రామ్ ల కర్బుజా లో ఉండే పోషకాలు

కేలరీలు                             30 కిలో క్యాలరీలు
నీటి శాతం                          90 %
కార్బో హైడ్రేట్స్                    7.6 g
చక్కర                               6.2 g
పీచు                                 0.4 g
ప్రోటీన్                              0.6 g
కొవ్వు                                0.2 g
విటమిన్ సి                        8.1 mg
విటమిన్ ఎ                        28µg (1% RDA)
పొటాషియం                       12mg
మేగ్నెసియం                      10mg
లైకోపీన్                             4,500µg

 

పుచ్చకాయను ఎలా తినాలి 
పుచ్చకాయను కొన్న తరువాత కొద్ది సేపు నీటిలో నానబెట్టి కడిగి తినడం శ్రేయస్కరం ..

1 . చిన్న ముక్కలుగా
2 . మిగతా పండ్ల తో సలాడ్ గా
3 . పుచ్చకాయ రసం
4 . మెత్తని గుజ్జుగా

పుచ్చకాయను వాటిలో ఉండే విత్తనాలతో పాటు గా తినాలి , ఈ విత్తనాల లో మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి , ఈ పోషకాలు మధుమేహ నియంత్రణలో , మరియు కాన్సర్ రాకుండా కాపాడుతాయి.

 

Related Posts

]]>
https://www.plus100years.com/watermelon-benefits-in-telugu/feed/ 0
Nirvana Shatakam Lyrics In Telugu ( నిర్వాణ శతకం ) https://www.plus100years.com/nirvana-shatakam-lyrics-telugu/ https://www.plus100years.com/nirvana-shatakam-lyrics-telugu/#respond Wed, 12 Mar 2025 11:42:29 +0000 https://www.plus100years.com/?p=3468 నిర్వాణ శతకం

జగద్గురువు ఆది శంకరాచార్యులు రాసిన నిర్వాణ శతకం శివుడు ఆయన తత్వాన్ని గురించి వివరించింది .

చిదానందరూపాన్ని గురించి వివరించింది .

నిర్వాణ శతకం మన మనస్సు దాని పరిధి గురించి చెప్పింది , ఈ శతకాన్ని చదివి ఆనందమయిన అనుభూతిని పొందండి .
మీ కోసం ఇక్కడ తెలుగు లో నిర్వాణ శతకం

Nirvana Shatakam Lyrics In Telugu

1. మనో బుధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమి ర్న తేజో న వాయు:
చిదానంద రూప: శివోహం శివోహం

 2. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయు:
న వా సత్పదాతుర్న వా పంచకోశ:
న వాక్పాణిపాదం న చోపస్తపాయు
చిదానంద రూప: శివోహం శివోహం

3. న మే ద్వేష రాగౌ న మే లోభమో హో
మాదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చర్తో న కామో న మోక్ష:
చిదానంద రూప: శివోహం శివోహం

4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా :
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహం

5. న మే మృత్యుర్న శంకా న మే జాతి భేద:
పితా నైవ మే నైవ మాతా న జన్మ:
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్య :
చిదానంద రూప: శివోహం శివోహం

6. అహం నిర్వికల్పో నిరాకార రూపొ
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ :
చిదానంద రూప: శివోహం శివోహం

Related Posts

]]>
https://www.plus100years.com/nirvana-shatakam-lyrics-telugu/feed/ 0
సంకట హర గణేశ స్తోత్రం – sankata nasana ganesha stotram in telugu https://www.plus100years.com/sankata-nasana-ganesha-stotram-in-telugu/ https://www.plus100years.com/sankata-nasana-ganesha-stotram-in-telugu/#respond Tue, 11 Feb 2025 02:39:00 +0000 https://www.plus100years.com/?p=2887 Updated: 15-06-2025

Author : plus100years’s team


శ్రీ గణేష స్తోత్రం లేదా సంకట నాశన గణపతి స్తోత్రం గణేశుడికి అత్యంత ప్రభావవంతమైన ప్రార్థనలలో ఒకటి. గణేశ స్తోత్రం నారద పురాణం నుండి తీసుకోబడింది.

మీరు sankata nasana ganesha stotram in telugu చదువుతున్నారు

ఇది అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. సంకట నాశన గణపతి స్తోత్రాన్ని రోజూ పఠించడం వల్ల మనిషి అన్ని రకాల ఆటంకాల నుండి విముక్తుడవుతాడు మరియు అన్ని దుఃఖాలను అధిగమిస్తాడు .

హిందీలో సంకట్ అంటే సమస్య మరియు నాశనం అంటే శాశ్వతంగా తొలగించడం. కాబట్టి, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వారి సమస్యలను శాశ్వతంగా తొలగించుకోవచ్చు.

sankata nasana ganesha stotram in telugu

సంకట నాశన గణపతి స్తోత్రంలో, నారద మహర్షి గణపతి యొక్క మహిమను వివరిస్తాడు. ప్రతి ఒక్కరూ తల వంచి గణేశుడిని పూజించి దీర్ఘాయువు మరియు అన్ని సమస్యల నివారణ కోసం ప్రార్థించాలని నారద మహర్షి చెప్పారు.

వక్రతుండ్, ఏకదంత, కృష్ణ పింగాక్ష , గజ్వక్ర, లంబోదర, హేరంబ , విఘ్న రాజేంద్ర, ధూమ్రవర్ణ, పురాణ పురుష , వినాయకుడు, గణపతి , మోదక ప్రియాయ  మొదలైన వివిధ పేర్లను పిలువాలి. ఈ పేర్లను రోజులోని మూడు కాలాల్లోనూ జపించాలి. ఇది ఏ విధమైన భయం నుండి అయినా వ్యక్తిని విముక్తి చేస్తుంది.

గణేశుడి ఆరాధన అన్ని కోరికలను తీరుస్తుంది. డబ్బు కోసం వెతుకుతున్న వ్యక్తి ధనవంతుడు అవుతాడు, జ్ఞానం కోసం వెతుకుతున్న వ్యక్తి దానిని పొందుతాడు మరియు మోక్షం కోసం వెతుకుతున్న వ్యక్తి దానిని పొందుతాడు.

సంకటనాశన గణేశస్తోత్రమ్

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ |

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే || 1 


ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2


లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||3


నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ |

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ || 4


ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! || 5


విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ |

పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6


జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః ॥ 7


అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |

తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ॥ 8 

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్

ఈ స్తోత్రాన్ని సంకష్టహర చతుర్థి రోజు 3 సార్లు చదవడం ఆనవాయితీ , ఎందుకంటే మూడు పూటలు ఆ యొక్క గణపతి సంరించుకుంటూ ఆయన అనుగ్రహం పొంది సంకటాలను దూరం చేసుకోవడం. ఆ రోజు ప్రొద్దున , మధ్యాహ్నం మరియు సాయంత్రం కానీ లేదా చంద్రోదయం సమయం లో చదవాలి.

sankata nasana ganesha stotram in telugu

ఈ స్తోత్రం ఆరు నెలల్లోనే ఫలితాలను అందించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. ఒక సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతాడు.

 

ఇది కూడా చదవండి : అత్యంత శక్తి కల : కాలభైరవాష్టకం అర్థం తో సహితంగా

Related Posts

]]>
https://www.plus100years.com/sankata-nasana-ganesha-stotram-in-telugu/feed/ 0
Powerful Kalabhairava Ashtakam Telugu Lyrics (With Meaning ) https://www.plus100years.com/kalabhairava-ashtakam-telugu-lyrics-with-meaning/ https://www.plus100years.com/kalabhairava-ashtakam-telugu-lyrics-with-meaning/#respond Thu, 30 Jan 2025 02:28:07 +0000 https://www.plus100years.com/?p=2791 జీవితంలో శత్రువులతో బాధపడేవారు, ప్రజల బెదిరింపులు మరియు భయాందోళనలు ఎదుర్కొంటున్నవారు ఈ కాల భైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించాలి.

Kalabhairava Ashtakam Telugu Lyrics ను అర్థం తో సహితంగా చదివి ఆ కాలభైరవుని అనుగ్రహాన్ని పొందండి

కాలభైరవాష్టకం అనేది శ్రీమద్ శంకరాచార్యులు రచించిన ఒక శ్లోకం. దాని ప్రవాహం శివ తాండవం లాంటిది. కాళికా పురాణం ప్రకారం, భైరవుడు శివుని అనుచరులలో ఒకడు. అతని వాహనం కుక్క. 

భైరవుని మూలం: –

శివ మహాపురాణం ప్రకారం, భైరవుడు మార్గశీర్ష మాసంలోని కృష్ణ అర్ధభాగంలో ఎనిమిదవ రోజు మధ్యాహ్నం జన్మించాడు. ఈ తేదీని కాలభైరవ అష్టమి అని పిలుస్తారు. గ్రంథాలలో అనేక ఇతిహాసాలు కనిపిస్తాయి. అంధకాసురుడు అనే రాక్షసుడు తన అహంకారంతో శివునిపై దాడి చేశాడని, అప్పుడు భైరవుడు శివుని రక్తం నుండి జన్మించాడని చెబుతారు.

kalabhairavashtakam lyrics in telugu

 

కాల భైరవాష్టకమ్

దేవరాజ  సేవ్యమాన  పావనాంఘ్రి  పంకజం
వ్యాలయజ్ఞ  సూత్రమిందు  శేఖరం  కృపాకరమ్ |
నారదాది  యోగిబృంద  వందితం  దిగంబరం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే || 1

అర్థం : దేవతలకు రాజు అయిన ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు జీవరాసుల మీద కృపను చూపేవాడు . నారుదుడు మరియు యోగుల చేత స్తుతించ బడే వాడు (ఆరాధించబడే ).
దిగంబరుడు మరియు కాశీ క్షేత్రం యొక్క పాలకుడు అయిన ఆ కాలభైరవుడికి నమస్కారం.


భానుకోటి  భాస్వరం  భవాబ్దితారకం  పరం

నీలకంఠ  మీప్సితార్ధదాయకం  త్రిలోచనం |
కాలకాల  మంబుజాక్ష  మక్షశూల  మక్షరం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే || 2

అర్థం : కోటి సూర్యుల వలె తేజస్సు కలవాడు , అస్తిత్వ సాగరం నుండి రక్షించే దేవుడు, నీలం రంగు కలిగినవాడు , ప్రాపంచిక సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు మరియు మూడు కళ్ళు కలవాడు. త్రిశూలము మూడు లోకములను కలిగియున్న మరియు నాశనము లేని కాశీకి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను.


శూలాటంక  పాశదండ  పాణిమాది  కారణం

శ్యామకాయ  మాదిదేవ  మక్షరం  నిరామయమ్ |
భీమవిక్రమం  ప్రభుం  విచిత్ర  తాండవ  ప్రియం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే || 3

అర్థం : అతని శరీరం నల్లగా ఉంటుంది (హాలాహలాన్ని ) మరియు అతను తన చేతుల్లో ఈటె, టంకా, పాశదండాన్ని (ఒకరకమయిన ఆయుధం) పట్టుకుంటాడు . ఆది దేవుడు, నాశనం లేనివాడు , అతను గొప్ప పరాక్రమవంతుడు.

 నేను కాశీ నగర అధిష్టాన దేవత, సర్వశక్తిమంతుడు , తాండవ నృత్యం చేసే కాలభైరవుడిని పూజిస్తాను

 

భుక్తి  ముక్తి  దాయకం  ప్రశస్తచారు  విగ్రహం.
భక్తవత్సలం  స్థిరం  సమస్తలోక  విగ్రహమ్ |
నిక్వణన్  మనోజ్ఞ  హేమ  కింకిణీ  ల  సత్కటిం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే || 4 

అర్థం : భక్తి ని కలిగించేవాడు , ముక్తిని ప్రసాదించేవాడు , గొప్ప సుందరమయిన రూపం కలవాడు .ఆ దృఢమయిన రూపం తో సమస్త లోకాలను నియంత్రించేవాడు .మనోజ్ఞమయిన బంగారు పట్టి లతో , ఆభరణాలతో అలకరించుకొన్నవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.


ధర్మసేతు  పాలకం  త్వధర్మమార్గ  నాశకం

కర్మ  పాశమోచకం  సుశర్మ  దాయకం  విభుమ్ |
స్వర్ణవర్ణ  కేశపాశ  శోభితాంగ  నిర్మలం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే|| 5

అర్థం : ధర్మ మార్గాన్ని రక్షించేవాడు, అధర్మాన్ని నాశనం చేసేవాడు, కర్మ బంధనాల నుండి విముక్తి కలిగించేవాడు,కేశపాశాలనుఁ తల మీద కలిగి ఉన్న సర్వవ్యాప్తి చెందేవాడు..
కాశీ నగరానికి అధిష్టాన దేవత అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను.


రత్న  పాదుకా  ప్రభాభిరామ  పాదయుగ్మకం

నిత్య  మద్వితీయ  మిష్ట  దైవతం  నిరంజనమ్ |
మృత్యు  దర్ప  నాశనం  కరాళదంష్ట్ర  భూషణం
కాశికాపురాధినాథ  కాలభైరవం  భజే || 6

అర్థం : రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యం అద్వితీయ మయిన ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు (అంటే అకాల మృత్యువు నుండి కాపాడే వాడు అని అర్థం ). ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నా హృదయపూర్వక నమస్కారం.


అట్టహాస  భిన్న  పద్మజాండకోశ  సంతతిమ్

దృష్టి  పాత  నష్ట  పాప  జాలముగ్ర  శాసనమ్ |
అష్టసిద్ధి  దాయకం  కపాలమాలికా  ధరం’
కాశికాపురాధినాథ  కాలభైరవం  భజే || 7

అర్థం : బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో చీల్చి చెండాడే ప్రళయకారకుడు. తన కనుచూపు తో పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ అమలుచేసేవాడు (లోకాలను క్రమశిక్షణతో నియంత్రించేవాడు ఆ పరమేశ్వరుడు ). అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను ఇచ్చేవాడు (తనను భక్తి తో కొలిచేవారికి అని అర్థం ). పుర్రెల ను దండ గా ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.


భూతసంఘ  నాయకం  విశాలకీర్తి  దాయకం

కాశివాసి  లోక  పుణ్యపాప  శోధకం  విభుమ్ |
నీతిమార్గ  కోవిదం  పురాతనం  జగత్పతిం
కాశికాపురాధి  నాథ  కాలభైరవం  భజే || 8

అర్థం : లోకమంతా కీర్తి కలిగినవాడు సకల భూతాలకు నాయకుడు , లోక రక్షకుడు.కాశీ మహాక్షేత్రం లో నివసించే సకల ప్రాణుల పాపలను శుద్ధి చేస్తూ పుణ్య ఫలాన్ని అందించేవాడు.నీతి మార్గాన్ని సూచించేవాడు , జగత్తు లోనే గొప్ప పండితుడు ప్రాచీనుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

ఫలశ్రుతి :

కాలభైరవాష్టకం  పఠంతి  యే  మనోహరం.
జ్ఞానముక్తి  సాధకం  విచిత్ర  పుణ్య  వర్ధనమ్ |
శోకమోహ  లోభదైన్య  కోపతాప  నాశనం
తే  ప్రయాంతి  కాలభైరవాంఘ్రి  సన్నిధిం  ధ్రువమ్ || 9

అర్థం : ఎవరయితే ఈ అందమైన ‘కాల భైరవాష్టకం’ పఠిస్తారో వారు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆశీర్వదించబడతారు. ఇది జ్ఞానం మరియు ముక్తిని పొందే సాధనం, ఇది భక్తుల యొక్క విశిష్ట ధర్మాలను పెంచుతుంది. దుఃఖం మరియు కోపాన్ని నాశనం చేస్తుంది ఎవరైతే దీనిని ప్రతిదినం చదువుతారోవారు కాల భైరవుని పాదాల వద్దకు చెరబడతారు అంటే కాల భైరవుని అనుగ్రహం పొందుతారు.ఇది తథ్యం

 

పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం 

శ్రీ కాలభైరవ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం లోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఉంది.
కాశీ-క్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఇదే అని అభిప్రాయం . కార్తిక బహులాష్టమిలో శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు మరియు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడికి దగ్గరలో కామారెడ్డి లో ట్రైన్ సౌకర్యం కలదు.
కామారెడ్డి నుండి 15 కిమీ మరియు నిజామాబాదు నుండి 54 కిమీ ఉంటుంది . ఇది జాతీయరహదారి NH 44 కు అతి దగ్గరలో ఉంటుంది.

ఇంకా ఇది కూడ చదవండి : హనుమాన్ చాలీసా -అర్థం తో 

Related Posts

]]>
https://www.plus100years.com/kalabhairava-ashtakam-telugu-lyrics-with-meaning/feed/ 0
Lingashtakam In Telugu With Complete Meaning https://www.plus100years.com/lingashtakam-in-telugu-with-complete-meaning/ https://www.plus100years.com/lingashtakam-in-telugu-with-complete-meaning/#respond Mon, 27 Jan 2025 02:06:19 +0000 https://www.plus100years.com/?p=2726 ఆ దేవాదిదేవుడు సకల ప్రాణి రక్షకుడు అయిన పరమేశ్వరుడి యొక్క కృప కటాక్షాలను పొందడానికి ఆది శంకరాచార్య విరచిత లింగాష్టకం మనకు ఒక ఆయుధం లాంటిది , దీనిని నిత్యం పఠిస్తే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందగలము .

Lingashtakam In Telugu

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ |

జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

అర్థం: బ్రహ్మ, విష్ణువు మరియు సమస్త దేవతలకు అత్యంత ప్రియమైన దేవుడు ఎవరు? ఆయన పరమ పవిత్రుడు, సమస్త జీవుల కోరికలను తీర్చేవాడు, విశ్వంలో లింగ రూపం గా స్థిరపడినవాడు, ఆయన మృత్యువు బాధలను నాశనం చేసే ఆ పరమేశ్వరుడి కి హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను.


దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ |

రావణ దర్ప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

అర్థం: సదాశివుడు, ఋషులు, దేవతలచే పూజించబడే దేవుడు, కోరికలను నాశనం చేసేవాడు (ఇంద్రియ వస్తువులపై మమకారం తగ్గించేవాడు), దయ మరియు కరుణ యొక్క సముద్రం మరియు మనలో ఉన్న అహంకారాన్ని నాశనం చేసేవాడు.
రావణుడి యొక్క గర్వాన్ని నాశనం చేసిన పూజ్యమైన మహాదేవుడి లింగ రూపానికి నా లక్షలాది ప్రణామాలు అర్పిస్తున్నాను.


సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |

సిద్ధ సురాసుర వందిత లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౩ ||

అర్థం: అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో పూత పూయబడినది, బుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించేది, సిద్ధ ఋషులు, దేవతలు, రాక్షసులు అందరూ పూజించే శివలింగం, అటువంటి లింగరూపం లో ఉన్న ఆ పరమ శివుడికి నా నమస్కారం.


కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |

దక్ష సుయజ్ఞ నినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4

అర్థం: బంగారం మరియు రత్నాలతో నిండిన ఆభరణాలతో అలంకరించబడిన, అన్ని వైపులా పాములచే చుట్టుముట్టబడిన, మరియు ప్రజాపతి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసిన ఆ లింగరూప పరమేశ్వరుడి నా యొక్క మనపూర్వక నమష్కారం .

కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ |

సంచిత పాప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

అర్థం: దేవతల దేవుడు, కుంకుమ మరియు గంధపు చెక్కలతో అద్ది, అందమైన తామర హారంతో అలంకరించబడిన లింగరూపం కలిగిన, పేరుకుపోయిన పాపపు కర్మల లెక్కను తుడిచిపెట్టగల, శివుని లింగ రూపానికి నా నమస్కారాలు అర్పిస్తున్నాను.


దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవచ లింగమ్ |

దినకర కోటి ప్రభాకర లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అర్థం: అన్ని దేవతలు మరియు దేవతల సమూహములు పూర్తి విశ్వాసం మరియు భక్తితో పూజించే, వేల సూర్యుల వలె తేజోవంతుడైన లింగ రూపంలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను.


అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ |

అష్టదరిద్ర వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

అర్థం: ఎనిమిది రకాల దళాలు ( పవిత్ర దళాలు ) సృష్టిలోని అన్ని సంఘటనలకు
సృష్టికర్త అయిన మరియు ఎనిమిది రకాల దరిద్రాల ను తొలగించే శివుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను.


సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ |

పరాత్పరం పరమాత్మక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

అర్థం: దేవతల గురువులు, దేవతలు మరియు ఉత్తములు పూజించే, దివ్య తోటల పువ్వులతో పూజించే, ఆది, అంతం లేని ఆ భోలేనాథ్ కు నేను ఎల్లప్పుడూ నా హృదయాన్ని అర్పిస్తాను. నేను నీకు నమస్కరిస్తున్నాను. 


లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ఈ లింగాష్టకాన్ని శివుని దగ్గర లేదా శివలింగం దగ్గర భక్తితో పఠించే వారు శివలోకాన్ని పొందుతారు మరియు సర్వదా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతారు.

=============================================================================

ఇది కూడా చదవండి : హనుమాన్ అనుగ్రహం కోసం – హనుమాన్ చాలీసా సంపూర్ణ అర్థం తో సహితంగా 

 

Related Posts

]]>
https://www.plus100years.com/lingashtakam-in-telugu-with-complete-meaning/feed/ 0
ఘోర కష్టోద్దారణ స్తోత్రం అర్థం తో సహితముగా (Ghora Kashtodharana Stotram In Telugu) https://www.plus100years.com/ghora-kashtodharana-stotram-in-telugu/ https://www.plus100years.com/ghora-kashtodharana-stotram-in-telugu/#respond Wed, 22 Jan 2025 12:30:23 +0000 https://www.plus100years.com/?p=2672 గురు దత్తాత్త్రేయ స్వామి అనుగ్రహం కోసం , సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం అయిన గురు వాసుదేవానంద సరస్వతి స్వామి ( టెంబే స్వామి ) రాసిన ఘోరకష్టోద్దారణ స్తోత్రం .
దీనిని ప్రతి రోజు శ్రద్ధ గా చదివి ఆ దత్తాత్త్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ..
జై గురు దేవ దత్త – దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ

Learn Ghora Kashtodharana Stotram in Telugu.

 

శ్రీపాద  శ్రీవల్లభ  త్వం  సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి  దేవాధిదేవ |
భావగ్రాహ్య  క్లేశహారిన్సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 1 ||

నువ్వు ఎల్లప్పుడూ శ్రీపాదుడివి, శ్రీవల్లభుడివి. శ్రీ దత్తా, ఓ దేవతల ప్రభువా, మమ్ములను రక్షించుము.

 

త్వం  నో  మాతా  త్వం  పితాఽప్తోఽధిపస్త్వం
త్రాతా  యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ |
త్వం  సర్వస్వం నో  ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 2 ||

ఓ ప్రసిద్ధి చెందిన బాధలను నాశనం చేసేవాడా, భావోద్వేగాలను పట్టుకుని మమ్మల్ని భయంకరమైన ఇబ్బందుల నుండి విడిపించువాడా, నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను.

నువ్వే మా తల్లివి, నువ్వే మా తండ్రివి, నువ్వే మా యజమానివి. మీరు యోగ రక్షకుడవు మరియు రక్షకుడవు మరియు నిజమైన గురువు.

ఓ ప్రభూ, విశ్వ రూపంలో ఉన్న మా మొత్తం ఆస్తి నువ్వే. నీకు నమస్కారం. ఈ భయంకరమైన బాధ నుండి మమ్మల్ని విడిపించు.


పాపం  తాపం  వ్యాధిమాధిం  చ  దైన్యం

భీతిం  క్లేశం  త్వం  హరాశు  త్వదన్యమ్ |
త్రాతారం  నో  వీక్ష్య  ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 3 ||

పాపం, బాధ, అనారోగ్యం, నిరాశ , దుఃఖం. ఈ వేదనలు , బాధలు మరియు కష్టాలనుండి మమ్ములను రక్షింపుము దత్త ప్రభు మీరు భయం, ఇబ్బంది మరియు దుఃఖాన్ని త్వరగా తొలగిస్తారు.


నాన్యస్త్రాతా నాఽపి  దాతా  న భర్తా

త్వత్తో  దేవ  త్వం  శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం  పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 4 ||

ఓ ప్రభూ, మమ్మల్ని మా రక్షకుడిగా చూడు. ఓ ప్రభూ, ఈ భయంకరమైన కష్టాల నుండి మమ్మల్ని విడిపించు.

మిమ్మల్ని శెరను వెడుతున్నాము , మీ యొక్క అనుగ్రం , చల్లని చూపు మా మీద ప్రసరించేటట్టు చేయు తండి ఓ దత్త ప్రభు మా బాధలను తొలగించు


ధర్మే  ప్రీతిం  సన్మతిం  దేవభక్తిం

సత్సంగాప్తిం  దేహి  భుక్తిం  చ  ముక్తిమ్ |
భావాసక్తిం  చాఖిలానందమూర్తే |
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 5 ||

వేరే రక్షకుడు లేడు, ఇచ్చేవాడు లేడు, భర్త లేడు. ఓ ప్రభూ, నీవే అందరికీ ఆశ్రయం, నీవే సర్వ ప్రాణులకూ దిక్కు , నువ్వే నన్ను కాపాడాలి దత్త ప్రభు .

 

శ్లోకపంచకమేతద్యో  లోకమంగళవర్ధనమ్ |
ప్రపఠేన్నియతో  భక్త్యా స  శ్రీదత్తప్రియో భవేత్ || 6 ||

ఈ లోకాన్ని మంగళప్రదం చేయు దత్త ప్రభు , నేను నిన్ను ప్రతి నిత్యం స్మరిస్తున్నాను నన్ను అన్ని బాధల నుండి కాపాడి నన్ను సన్మార్గం లో ఉంచి నీ యొక్క అనుగ్రాన్ని ఇవ్వు తండ్రి ..

నీతిని ప్రేమించడం, మంచి మనస్సాక్షి, దేవతల పట్ల భక్తి. నాకు నిజమైన సాంగత్యం, ఆనందం మరియు ముక్తిని ప్రసాదించు.

భవశక్తిర్చాఖిలానన్దమూర్తే । ఓ ప్రభూ, ఈ భయంకరమైన కష్టాల నుండి మమ్మల్ని విడిపించు.

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య – యతివరేణ్యులు శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణం ||


ఇది కూడా తప్పకుండ చదవండి : దత్తాత్రేయుని అవతారము నృసింహ సరస్వతి స్వామి వారి గురించి

Related Posts

]]>
https://www.plus100years.com/ghora-kashtodharana-stotram-in-telugu/feed/ 0